2 లక్షల రుణమాఫీ అమలుపై తుమ్మల కీలక ప్రకటన

2 లక్షల రుణమాఫీ అమలుపై తుమ్మల కీలక ప్రకటన

 మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి  ప్రయత్నిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వర్  రావు  అన్నారు. ఇందుకు ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు.  ఇప్పటి వరకు 64,75,89 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇపుడు రైతులపై మొసలి కన్నీరు కురిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు వచ్చిందంటూ  దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ రైతులకు తొలి ప్రాధాన్యాత ఇస్తున్నామని చెప్పారు. 
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో  ఏ ఒక్క ఏడాది రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో జమచేయలేదన్నారు.