
ఖమ్మం: తాను లఫంగి రాజకీయాలు చేయనని, ఖమ్మం జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. సుదీర్ఘంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని వాడుకోలేకపోతున్నామని ఆవేదన చెందానని, అన్ని ప్రాంతాలకు నీళ్లివ్వాలన్నది తన సంకల్పమని అన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం కృషి చేశామన్నారు. కానీ ఆనాటి ప్రభుత్వం లో కొన్ని ప్రత్యేక పరిస్థితి లో దేవాదుల తీసుకుని వచ్చామన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో దుమ్ముగూడెం రెండు విభాగాలుగా చేశామని తెలిపారు. దుమ్ముగూడెం లిఫ్ట్ గురించి ఆనాడు రాజశేఖర్ రెడ్డి కి వివరించి చెప్పానని అన్నారు. ఆనాటి రాజకీయ పరిస్థితి లో రెండింటికీ టెండర్ లు వైఎస్ఆర్ పిలిచారు.. కానీ పూర్తి కాలేదు కానీ ఆ ప్రాజెక్టు కు తిలోదకాలు ఇచ్చారన్నారు. దుమ్ముగూడెం ప్రోజెక్ట్ కు నిధులు ఇవ్వమని కూడా నేను శాసనసభ్యుడు గా పాదయాత్ర చేశానని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చెప్పానని చెప్పారు. గోదావరి జలాల కోసమే తాను టీఆర్ఎస్ లో చేరానని అన్నారు.
కేసీఆర్ తోనే పథకం మొదలు పెట్టించామని తెలిపారు. రెండో సారి బీఆర్ఎస్ అధికారం లోకి వచ్చాక కూడా సీతారామా ప్రాజెక్టు పంపు హౌస్ ల వరకే పరిమితం అయ్యిందని చెప్పారు. రోళ్ళ పాడు బయ్యారం అలైంజ్ మెంట్స్ మార్చారని, ప్రస్తుతం ముడు పంపు హౌస్ లు పూర్తి అయ్యాయన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేయడంలో సంతృప్తి ఉందన్నారు. తాను ఎక్కడా ప్రచార అర్భాటానికి వెళ్లలేదని, తాను సంకుచిత మనిషిని కాదని అన్నారు. ఫ్లెక్సీ నాయకుడిని అసలే కాదని, ఓడిపోతే ఊళ్లో వ్యవసాయం చేసుకున్నానని అన్నారు. సీతారామా ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ తీసుకున్నా తనకు బాధలేదన్నారు. తాను కట్టించిన వంతెనలు తనకు పేరు తెచ్చిపెట్టాయన్నారు. ఓడినంత మాత్రానా నాయకుడు కాదని తాను అనటం లేదన్నారు. ‘రేపు 15 న రండి మీ నెత్తిన కూడా నీళ్ళు జల్లుత.. పనులు పూర్తి చేయడం నా పని.. నా స్వార్థం కోసం పని చేయను.’అంటూ మంత్రి ఎమోషన్ అయ్యారు.