హైదరాబాద్, వెలుగు: నేడు గాంధీ భవన్‌లో జరగనున్న ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందజేయాలని సూచించాయి.
