అక్టోబర్ 14 నుంచి నేషనల్ ఆయిల్ సీడ్స్ పథకం అమలు..ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

అక్టోబర్ 14 నుంచి నేషనల్  ఆయిల్ సీడ్స్ పథకం అమలు..ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం నుంచి నేషనల్​ఆయిల్​సీడ్స్​పథకం 2025–26 అమలు చేయనున్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా.. ఈ స్కీమును రాష్ట్రంలో  సెక్రటేరియెట్​నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న  ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలకు రూ.46.15 కోట్లతో 100% సబ్సిడీతో వేరుశెనగ విత్తనాలను సరఫరా చేయనున్నారు.