కమీషన్ల కోసం ప్రాజెక్టుల పేర్లు మార్చి రీ డిజైన్.. వాళ్లవి అన్నీ అబద్ధాలే : ఉత్తమ్

కమీషన్ల కోసం ప్రాజెక్టుల పేర్లు మార్చి రీ డిజైన్.. వాళ్లవి అన్నీ అబద్ధాలే : ఉత్తమ్

కమీషన్ల కోసం ప్రాజెక్టులకు పేర్లు మార్చి రీ డిజైన్ చేశారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్, ఇందిరా ఎత్తిపోతలకు సుంకిశాలగా పేరు మార్చి రీ డిజైన్ చేశారని చెప్పారు. రాజీవ్, ఇందిరా ప్రాజెక్టులతో 2 వేల కోట్లతో 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు.   19 వేల కోట్లతో సీతారామ నిర్మించారని....కమీషన్ల కక్కుర్తితో సీతారామ ఎస్టిమేషన్ ను పెంచారని ఆరోపించారు ఉత్తమ్.

 బీఆర్ఎస్ హయాంలో సీతారామ కాల్వలకు  భూసేకరణ కూడా చేయలేదన్నారు ఉత్తమ్.  సీడబ్ల్యూసీ పర్మిషన్ తామే  తెచ్చామని కేటీఆర్ చెబుతున్నాడు..కానీ..  ఈ రోజు వరకు సీడబ్ల్యూసీ పర్మిషన్ పూర్తి స్తాయిలో రాలేదన్నారు.  బీఆర్ఎస్ వి అన్నీ అబద్దపు ప్రచారాలేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు. సీతారామ మోటర్లు బిగించింది తామేనని చెప్పారు

 బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులకు లక్షా 81 వేలు ఖర్చు చేశారని చెప్పారు ఉత్తమ్.   బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ ను ఆగం చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టే పనిలో ఉన్నామన్నారు.  కావాలనే  ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం  చేస్తున్నారని చెప్పారు. కాళేళ్వరంలో లక్ష కోట్లు ఛర్చు చేసినా ఎకరాకు నీళ్లియ్యలేదన్నారు.  పదేళ్లు తూతూ  చేశారని చెప్పారు.   పదేళ్లు అధికారంలో ఉండి పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదన్నారు ఉత్తమ్. తాము పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు ఉత్తమ్.