- చెరువుల కమిటీలు వేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల్లో పూడిక తీయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నెలన్నర క్రితమే చెరువుల్లో పూడిక తీయాలని చెప్పినా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వేసవిలోనే చెరువుల పూడికతీతను ప్రాధాన్యంగా పెట్టుకోవాలన్నారు. శనివారం జలసౌధలో ఈ అంశంపై రివ్యూ చేశారు.
జిల్లాల్లో చెరువుల కమిటీలు వేయాలని, వాటిలో రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వెంటనే నామినేషన్లు ఫైనల్ చేసి, కమిటీల రూల్స్ ను సిద్ధం చేయాలన్నారు. పూడికతీతకు సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ ఉన్నాయని, వాటికి అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పారు. పూడిక తీయడంతోపాటు కట్టల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
