లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

పదేండ్లు సీఎంగా పని చేసి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు నీటి పారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదే పదే అబద్దాలతో కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్ని చేసినా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటీ కూడా రాదన్నారు. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం ఓ టీవీ ఛానల్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజలకు నిజాలు చెప్పాలసిన బాధ్యత మంత్రులుగా మాపై ఉందన్నారు. 

విద్యుత్ విషయంలో 7 వేల మెగావాట్ల నుంచి 12 వేలకు పెంచామని కేసీఆర్ పచ్చి అబద్దం చెప్పారన్నారు మంత్రి. పదేళ్లలో వాళ్లు స్టార్ట్ చేసి పూర్తి చేసింది కేవలం భద్రాద్రి పవర్ ప్లాంట్ మాత్రమేనన్నారు.  కాళేశ్వరం మీద 95 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేశారని.. అది పూర్తి చేయాలంటే రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. మేడిగడ్డ కుంగింది కేసీఆర్ హయాంలోనేనని..  కుంగిన 45 రోజులకు కూడా కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. ప్రాజెక్టు కుంగిన తర్వాత నీళ్లు వదిలింది మీరే, కానీ నెపం మాపై నెడుతున్నారని మండిపడ్డారు.

104 ఎమ్మెల్యేల నుంచి 39 కు పడిపోయారని.. అయినా వాళ్ల తీరు మాత్రం మారలేదని విమర్శించారు ఉత్తమ్. అందులో నుంచి 25 మంది కాంగ్రెస్ లోకి వస్తున్నారని మరోసారి అయన హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలో 7031 వరి కొనుగోలు కేంద్రాలు పెడితే.. మేము 7200 కేంద్రాలు పెట్టామన్నారు.  గతేడాది కంటే ఈ సారి 15 రోజులు ముందే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.