హద్దు మీరుతున్నవ్.. సిగ్గుండాలి..హరీశ్ పై శివాలెత్తిన ఉత్తమ్

హద్దు మీరుతున్నవ్.. సిగ్గుండాలి..హరీశ్ పై  శివాలెత్తిన  ఉత్తమ్

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై  చర్చ సందర్బంగా అసెంబ్లీలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  ఎమ్మెల్యే హరీశ్ పై , మంత్రి కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి  తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.  కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో నే గొప్ప ప్రాజెక్ట్ అని గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో చూపిస్తానని హరీశ్ అనడంతో  కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.

సోనియా గాంధీ దేవత అని గతంలో కేసీఆర్ కూడా మాట్లాడారు.  కాళేశ్వరంపై కేసీఆర్ మాట్లాడాలి.   అయినా అసెంబ్లీలో హరీశ్ ఏ హోదాలో మాట్లాడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.  కాళేశ్వరంపై కేసీఆర్ మాట్లాడాలి. అసెంబ్లీకి రాకుండా ప్రజలను కేసీఆర్ అవమానపరుస్తున్నారు.  కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తప్పును ఒప్పుకోవాలి. దోచుకోవడం తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదు అని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. 

ఆ తర్వాత మాట్లాడిన హరీశ్ రావు. గతంలో కాళేశ్వరంపై కేసీఆర్  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే ఉత్తమ్ ప్రిపేర్ కాలేదన్నారని  అన్నారు.  దీంతో వెంటనే కల్గజేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హరీశ్ రావు హద్దు మీరి మాట్లాడుతున్నారు..  బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలి...లక్ష కోట్లు దుర్వినియోగం చేసి నవ్వుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని హరీశ్ బుదులిచ్చారు.