ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి : మంత్రి వాకిటి శ్రీహరి

ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి : మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: చాకలి ఐలమ్మ పోరాటం ఈ తరానికి స్ఫూర్తి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆమె జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐలమ్మ చిత్రపటానికి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బాంచెన్ నీ కాల్మొక్తా.. అన్న ప్రజలతోనే బందూకులను పట్టించిన గొప్ప పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆమె బాటలో నడిచి బడుగు, బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రిపిలుపునిచ్చారు.