
- గాంధీ భవన్ ‘ముఖాముఖి’లో మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదలు నేరుగా మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మంత్రులతో ముఖాముఖి’ విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సూచనలతో తానూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నదని వెల్లడించారు. గాంధీ భవన్‌లో 90 వినతులను తీసుకొని, ఆయా సమస్యలకు త్వరగా పరిష్కరించాలని అధికారులను మంత్రి కోరారు.