బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటున్నది..రిజర్వేషన్ల కోసం కలిసి కొట్లాడాలి: మంత్రి వాకిటి శ్రీహరి

బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటున్నది..రిజర్వేషన్ల కోసం కలిసి కొట్లాడాలి: మంత్రి వాకిటి శ్రీహరి
  •     ఓయూలో విద్యార్థుల ధర్మ దీక్షకు హాజరైన
  • ఆర్.కృష్ణయ్య, కోదండరామ్, జాజుల

ఓయూ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డి సిద్ధంగా ఉన్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అడ్డుకుంటున్నదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రిజర్వేషన్ల కోసం బీసీలందరూ కలిసి కొట్లాడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల సాధన కోసం ధర్మ దీక్ష పేరుతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆర్ట్స్ కాలేజీ ముందు ఎండలో దీక్షను కొనసాగించారు. 

మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, విప్ బీర్ల అయిలయ్య, జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ విశాదరన్ మహారాజ్, టీజేఎస్ చీఫ్‌‌‌‌ కోదండరామ్‌‌‌‌, వి.హనుమంతరావు, ప్రొఫెసర్ రామయ్య హాజరై, మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 

ఓయూలో మొదలైన బీసీ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తుందని హెచ్చరించారు. ధర్మ దీక్ష చేస్తున్న విద్యార్థులకు వీహెచ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వట్టికూటి రామారావు గౌడ్, రెడ్డి శ్రీను ముదిరాజ్, జనసేన విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్, సైదులు యాదవ్, భీం రావు నాయక్, మాసంపల్లి అరుణ్ కుమార్, రాస వెంకట్ ముదిరాజ్, రమేశ్‌‌‌‌ యాదవ్, కోల జనార్దన్ పాల్గొన్నారు.