ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె

ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె

కామారెడ్డి: కనీస మద్దతు ధర రావాలంటే క్లీనింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, రైస్ మిల్లర్లు, సొసైటీ చైర్మన్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రం ససేమిరా అన్నప్పటికీ రైతులు నష్టపోవద్దనే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తోందన్నారు. దీనికోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని, రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో పండించనంతా వరిని తెలంగాణలో పండించారని తెలిపారు. అయినా ప్రభుత్వం ప్రతి గింజను కొంటుందని పేర్కొన్నారు. దళార్లను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. గత సీజన్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈ సారి అలా జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండి...

కేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు

కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం