అక్బరుద్దీన్‌కు ఎందుకంత కోపం వస్తోందో అర్థం కావట్లె : ప్రశాంత్ రెడ్డి

 అక్బరుద్దీన్‌కు ఎందుకంత కోపం వస్తోందో అర్థం కావట్లె :  ప్రశాంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వంపై  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శలు చేయడంతో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా సాగాయి. అసెంబ్లీలో హామీలు ఇస్తారు కానీ అమలు చేయరంటూ  అక్బరుద్దీన్‌ విమర్శలు చేశారు. పాతబస్తీని ఇంకా అభివృద్ధి చేయడం లేదన్నారు. సీఎం, మంత్రులు, ఎవరినీ కలవరని పనులు చేయించుకునేందుకు చెప్రాసిని చూపించినా వెళ్లి కలుస్తామంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

అయితే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోపణలపై  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. మాకు కోపం రావడం లేదు. అక్బరుద్దీన్  ఒవైసీకే కోపం వస్తుందన్నారు. ఇంతకుముందు అక్బరుద్దీన్ బాగానే మాట్లాడేవారు  కానీ ఇప్పుడు ఆయనకు ఎందుకు కోపం వస్తుందో అర్ధం కావడం లేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడాలని అక్బరుద్దీన్ కు మంత్రి వేముల సూచించారు.

మరోవైపు అక్బరుద్దీన్‌ కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ కౌంటర్ వేశారు. గవర్నర్‌ ప్రసంగంపై మాట్లాడితేనే సమాధానం ఇస్తామన్నారు. ఆవేశంగా గొంతు చించుకునే మాట్లాడితే ఏమీ రాదన్నారు. చెప్పాలనుకున్న పాయింట్ పద్ధతిగా. మర్యాదగా కూడా చెప్పొచ్చన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన గొప్పవాళ్లం అనుకుంటే పొరపాటేనని చెప్పారు.