ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర గ్రాండ్గా మంత్రి వివేక్ బర్త్డే వేడుకలు

ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర గ్రాండ్గా మంత్రి వివేక్ బర్త్డే వేడుకలు

ఓయూ, వెలుగు: ఓయూ ఆర్ట్స్​ కాలేజీ వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి బర్త్​డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాల స్టూడెంట్ జేఏసీ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి మంత్రి వివేక్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం చేసిన విద్యార్థులపై పటియాల పీఎస్​లో కేసులు కాకుండా చూశారని గుర్తు చేసుకున్నారు. 

రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ కమిటీ అధ్యక్షుడు రాహుల్, అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్, రమేశ్, కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

నిలోఫర్ లో పండ్ల పంపిణీ
జై భీమ్ సైనిక్ ఫౌండేషన్, గోసంగి సంఘం సభ్యులు సంయుక్తంగా ఆదివారం విజయనగర్ కాలనీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నిలోఫర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా జై భీమ్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి రాజకీయంగా మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంపత్ మహేష్, యామిని సొరపాక సంపత్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.