ముషీరాబాద్, వెలుగు: ప్రజల హక్కులను కాపాడేందుకు కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కమ్యూనిస్టు లీడర్లు ప్రతాప్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కమ్యూనిస్టు జేఏసీ చైర్మన్ కోలా జనార్ధన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడి దారులు, కార్పొరేట్ శక్తులకు సహజ సంపదను దోచి పెడుతోందని ఆరోపించారు. రైతులు, కార్మికులను అణిచివేసేందుకు కంకణం కట్టుకుందని విమర్శించారు. సమావేశంలో పాశం యాదగిరి, చెన్న రాములు, గాదగోని రవి, మురహరి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
