ఏఐ వాడకంపై అమెజాన్‌‌‌‌ ఉద్యోగుల వ్యతిరేకత

ఏఐ వాడకంపై అమెజాన్‌‌‌‌ ఉద్యోగుల వ్యతిరేకత

న్యూఢిల్లీ:  వెయ్యికిపైగా అమెజాన్‌‌‌‌ ఉద్యోగులు ఏఐ అభివృద్ధిపై “తీవ్ర ఆందోళనలు” వ్యక్తం చేస్తూ ఓపెన్ లెటర్‌‌‌‌పై సంతకం చేశారు. కంపెనీ ఇటీవల భారీ ఉద్యోగాల కోతలు ప్రకటించి, కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ లేఖ వెలువడింది.  

అమెజాన్‌‌‌‌  ఏఐ పాలసీ ప్రజాస్వామ్యం, ఉద్యోగాలు, పర్యావరణానికి హానికరమని ఈ వెయ్యి మంది ఉద్యోగులు  హెచ్చరించారు. ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, గిడ్డంగి సిబ్బంది లేఖపై సంతకం చేశారు. డేటా సెంటర్లను రెన్యూవబుల్ ఎనర్జీతో  నడపాలని డిమాండ్ చేశారు. 

అమెజాన్‌‌‌‌ తన 2019 క్లైమేట్ లక్ష్యాలను విస్మరించి ఏఐ కోసం ఉద్గారాలను పెంచిందని లేఖలో  ఆరోపించారు. 2019 నుంచి వార్షిక ఉద్గారాలు 35శాతం పెరిగాయని, కొత్త ఏఐ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కోల్, గ్యాస్ ప్లాంట్స్‌‌‌‌పై ఆధారపడుతుందని హెచ్చరించారు. కాగా, అమెజాన్ తన వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌, ఇతర సెగ్మెంట్లలో ఏఐ, ఆటోమేషన్ వాడకాన్ని పెంచి, సుమారు 30 వేల మందిని తీసేయాలని ప్లాన్ చేస్తోందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.