ఐటీ కారిడార్లోని లెమన్ ట్రీ హోటల్కు బాంబు బెదిరింపు

ఐటీ కారిడార్లోని లెమన్ ట్రీ హోటల్కు బాంబు బెదిరింపు

మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్​కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది.  ఒక్కసారిగా హోటల్ సిబ్బంది, కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. మాదాపూర్ ఇన్​స్పెక్టర్ కృష్ణ మోహన్ వివరాల ప్రకారం.. రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కన ఉన్న లెమన్ ట్రీ రెడ్ ఫాక్స్ హోటల్ లో బాంబు పెట్టామంటూ ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హోటల్​కు మెయిల్ పంపారు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో మాదాపూర్ పోలీసులు బాంబ్ స్క్వాడ్, సెక్యూరిటీ వింగ్, డాగ్  స్క్వాడ్ లతో హోటల్ లో దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు చేశారు. అనంతరం ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. లేవని  మాదాపూర్ పోలీసులు నిర్ధారించారు. హోటల్ కి వచ్చిన మెయిల్ ఫేక్ గా గుర్తించి, మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.