వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లాలో మొత్తం 366 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 184 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు, 182 నామినేషన్లు వార్డు స్థానాలకు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా ధారూరు, నవాబుపేట మండలాల్లో 35, అత్యల్పంగా బంట్వారం మండలంలో 8 నామినేషన్లు వచ్చాయి.
వార్డు సభ్యుల స్థానాల కోసం అత్యధికంగా మోమిన్ పేట మండలంలో 52, అత్యల్పంగా కోట్ పల్లి మండలంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో వికారాబాద్, మోమిన్ పేట, నవాబుపేట, ధారూర్, కోట్పల్లి, బంట్వారం, మర్పల్లి మండలాల్లో ఎలక్షన్లు జరుగనున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థుల హడావుడితో సందడి నెలకొంది.
