
మంచిర్యాల: చెన్నూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన హైదరాబాద్-చెన్నూరు బస్ సర్వీసును ప్రారంభించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం (జూలై 6) చెన్నూర్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్‌లో 5 కొత్త బస్ సర్వీసులను ఆయన ప్రారంభించారు. చెన్నూర్ నుంచి హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు నూతన సర్వీసులను ప్రారంభించారు.
ALSO READ | ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. చెన్నూర్ పట్టణంలో బస్ డిపో కావాలని ప్రజలు కోరుతున్నారని.. అయితే బస్ డిపో కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడానని ఆయన తెలిపారు. డిపోకు సంబంధించిన భూ వివాదం ఉండటంతో పనులు ఆగిపోయాయని క్లారిటీ ఇచ్చారు. డిపో ఏర్పాటు చేసే భూమికి సంబంధించి ఎవరైతే కేసు పెట్టారో.. కేసును వాపసు తీసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు.