
చెన్నూరులోని కోటిపల్లి మండల కేంద్రంలో ఉన్న సివిల్ సప్లైస్ గోదాంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో రూ. 500 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌లో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నానని అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.చెన్నూర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా పూర్తిగా అదుపులో ఉందని.. అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించమని అన్నారు.
ALSO READ | అక్రమ మైనింగ్కి పాల్పడితే ఎవర్నీ వదిలిపెట్టొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక అందజేస్తోందని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని అన్నారు మంత్రి వివేక్. కేవలం 9 రోజుల్లో రూ. 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు.
టింగ్ టింగ్ అని ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయని రైతులు చెబుతున్నారని అన్నారు. మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండే అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపామని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నాయని.. ఇలాంటి దుష్ప్రచారాలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి వివేక్.