అక్రమ మైనింగ్కి పాల్పడితే ఎవర్నీ వదిలిపెట్టొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

అక్రమ మైనింగ్కి పాల్పడితే ఎవర్నీ వదిలిపెట్టొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

అక్రమ మైనింగ్ కి పాల్పడితే ఎవరిని ఊపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతి పక్ష నాయకులు ఇసుక అక్రమ రవాణాపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి ఫేక్ వార్తల పైన అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేవారిపైన  పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు వివేక్..

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంలో  లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి వివేక్. మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా కోటపల్లి మండల కేంద్రానికి రావడంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చెన్నూర్ నియోజకవర్గంలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి .  నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మార్నింగ్ వాక్ లో సమస్యలు తెలుసుకొని అన్ని పూర్తి చేస్తున్నాను.  కోటపల్లి మండలంలోని ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేశాను. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ పత్రాలను అందజేయడం సంతోషంగా ఉంది .  అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అందజేస్తాం. 

►ALSO READ | ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా నిధులు మంజూరు చేస్తున్నాం.  9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమచేశాం.   నేను మైనింగ్ శాఖ మంత్రి గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి అక్రమ ఇసుక పైన ఉక్కు పాదం మోపుతున్నాం. చెన్నూర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకోవాలి. అక్రమ మైనింగ్ కి పాల్పడితే ఎవరిని ఊపేక్షించేది లేదని పోలీసులకు అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్.