
కడెం, వెలుగు: కడెం జలాశయానికి ఎగవన వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం కొద్దికొద్దిగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా, 685.325 అడుగులకు చేరుకుంది. శనివారం ఉదయం 1466 క్యూసెక్కుల వరకు ఇన్ ఫ్లో వచ్చింది. సాయంత్రం వరకు అది 1600 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయానికి ఇప్పటివరకు 11 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది.