తానిపర్తి ప్రేమలతకు మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి

తానిపర్తి ప్రేమలతకు మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి

జూబ్లీహిల్స్, వెలుగు: ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు తల్లి ప్రేమలత ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్​లో కన్నుమూశారు. మంగళవారం (సెప్టెంబర్ 30) జూబ్లీహిల్స్​లోని ఎన్ కన్వెన్షన్​లో ఆమె దశదినకర్మ కార్యక్రమం జరిగింది. 

రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కార్యక్రమానికి హాజరై, ప్రేమలత ఫొటోకు నివాళులర్పించారు. అనంతరం భాను ప్రసాద్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.