అరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

అరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌‌ లైన్. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ఏషియన్ సురేష్​ డిస్ట్రిబ్యూషన్ ద్వారా  అక్టోబర్  10న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

అరి' అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం. మనిషిలో ఉండే అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కాన్సెప్ట్‌ను ఈ సినిమాకు ప్రధాన కథాంశంగా ఎంచుకున్నారు దర్శకుడు జైశంకర్. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా టచ్ చేయని ఈ క్లిష్టమైన అంశాన్ని తెరకెక్కించడం విశేషం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 8న హైదరాబాద్  దస్ పల్లా హోటల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు  ముఖ్య అతిథులుగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి,  ఎమ్మెల్సీ పైడి రాకేష్ రెడ్డి పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. సినిమాలో సాయికుమార్ ఉన్నాడంటే సినిమా హిట్ అవుతుందన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం కూడా అన్ని రకాల  ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. 

అందరికీ మన సంస్కృతి, వేదాలు  తెలియాలన్నారు  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్... మోడ్రన్ ప్రపంచంలో ఉన్నా అన్ని తెలుసుకోవాలని సూచించారు. ఆధ్యాత్మికత అంటే అదొక మతానికి చెందిన అంశంగా చూస్తున్నారని.. పరిణితి చెందిన నాయకులుగా ఉండాలంటే.. మనం కూడా ఇలాంటి సినిమాలు చూడాలన్నారు అద్దంకి దయాకర్.

దర్శకుడు జైశంకర్ మాట్లాడుతూ, "మనిషి మనసులో పది తలలున్న రావణుడు కాదు, కేవలం ఆరు తలలున్న అరిషడ్వర్గాలు ఎంతటి విధ్వంసం సృష్టిస్తాయో ఈ సినిమాలో చూపించాం. కృష్ణ తత్వాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాం. ఈ కాన్సెప్ట్ కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మాకు నమ్మకం ఉంది" అని తెలిపారు.