తిరుపతిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం.. మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

తిరుపతిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం.. మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

తిరుపతి: తెలంగాణ కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తిరుపతి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ మైదానంలో మాజీ మంత్రి పరసా రత్నం మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ మంత్రులతో కలిసి మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్ను మహాత్మ పూలే ఫౌండేషన్ ఆర్గనైజ్ చేసింది.