
శనివారం ( జులై 26 ) హైదరాబాద్ రెహమత్ నగర్ లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ మీటింగ్ కి హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. వర్షంలో సైతం బూత్ కమిటీ మీటింగ్ కి కార్యకర్తలు రావడం సంతోషమని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు మంత్రి వివేక్. రహమత్ నగర్ లో నాలా సమస్య పరిష్కరిస్తానని.. సీసీ రోడ్లు, నాలా నిర్మాణం కోసం రూ. 12 కోట్లు మంజూరు చేయిస్తానని అన్నారు.
రహమత్ నగర్ లో ప్రజలకు రేషన్ కార్డులు అందించే కార్యక్రమం ఏర్పాటు చేసి నిరుపేదలందరికి కార్డులను అందిస్తామని.. ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. బీద ప్రజలకు పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసి మంజూరు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి వివేక్.
డబల్ బెడ్ రూమ్స్ మంజూరుతో పాటు ఆసక్తి ఉన్న ప్రజలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు.. రహమత్ నగర్ లో ప్రజలకు అవసరమైన కమ్యూనిటీ హల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి వివేక్. మహిళలకు బస్ సౌకర్యం కోసం రవాణా శాఖ మంత్రితో మాట్లాడి రహమత్ నగర్ కు అదనపు బస్సులను ప్రారంభిస్తామని అన్నారు.రహమత్ నగర్ లో హై టెన్షన్ లైన్ల సమస్య పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తున్నామని అన్నారు.
అలాగే గల్లీలలో నాలా, సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 12 కోట్ల నిధుల మంజూరి చేయిస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. గతంలో వడ్డెరలకు జీవన భృతి కోసం కెటాయించిన భూమి తిరిగి అందేలా మైనింగ్ అధికారులకు విచారణకు ఆదేశాలు జారీ చేసామని అన్నారు. ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు ముందుండాలని.. కార్యకర్తలు ప్రజలతో మమేకమైతేనే సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు మంత్రి వివేక్. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించేలా కార్యకర్తలు పాటు పడాలని అన్నారు. కార్యకర్తల కృషి తోనే ప్రజల అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు మంత్రి వివేక్.