 
                                    గురువారం ( అక్టోబర్ 30 ) జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్ పేట్ డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అంటున్నారని.. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో కేటీఆర్ చెప్పాలని అన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
పేదల పక్షాన నిలబడే వ్యక్తిని కాబట్టే అధిష్టానం తనను ఇంచార్జిగా నియంనించిందని అన్నారు. షేక్ పేట్ డివిజన్ అభివృద్ధి చెందలేదంటే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ప్రశ్నించాలని అన్నారు మంత్రి వివేక్. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని... పదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పాలని అన్నారు. షేక్ పేట్ డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయని.. పదేళ్లలో బీఆర్ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు.
ముస్లిం మైనారిటీ నుండి గతంలో మహమూద్ అలీ మంత్రిగా పని చేసారని.. ఆయన ముస్లిం సమాజానికి ఏం చేయలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అజారుద్దీన్ ని మంత్రి చేస్తోందని.. ఎమ్మెల్సీగా ముస్లిం మైనారిటీ వ్యక్తికి అవకాశం ఇస్తే బీఆర్ఎస్ అడ్డుకున్నారని అన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని.. బీఆర్ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లేనని అన్నారు.
ఇంకా మూడేళ్ళ పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. కాంగ్రెస్ వల్లే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని బీఆర్ఎస్ గతంలో హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు మంత్రి వివేక్. 28 రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారని.. సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు మంత్రి వివేక్.

 
         
                     
                     
                    