నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ విగ్రహం: మంత్రి వివేక్ వెంకటస్వామి

నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్  విగ్రహం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇటీవల రియాజ్ అనే బైక్ దొంగ చేతిలో  హత్యకు గురైన సీసీఎస్ నిజామాబాద్  కానిస్టేబుల్ ప్రోమోద్  కుటుంబాన్ని  పరామర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రమోద భార్య ప్రణీతను ఫోన్ లో పరామర్శించిన ఆయన..  ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  నిజామాబాద్ లో తన సొంత ఖర్చులతో ప్రమోద్  విగ్రహం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి నగర్ లో అక్టోబర్ 17న కానిస్టేబుల్  ప్రమోద్ ను రియాజ్ అనే బైక్ దొంగ కత్తితో పొడిచి చంపాడు. బైక్ దొంగ రియాజ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడిచాడు రియాజ్. కత్తితో ఛాతిలో బలంగా పొడవడంతో ఘటనాస్థలంలోనే కుప్పకూలాడు ప్రమోద్. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలించే లోపే ప్రమోద్ మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు రియాజ్ ను పట్టుకున్న పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.