V6 News

జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్సే: వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్ లో  గెలిచేది కాంగ్రెస్సే: వివేక్ వెంకటస్వామి
  • అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ 
  • మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • షేక్ పేట  డివిజన్లో డోర్ టూ డోర్ ప్రచారం 
  • బీఆర్ఎస్  కు,  బీజేపీ సపోర్ట్ చేస్తుందన్న మినిస్టర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి తమ పార్టీకి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. నియోజకప ర్గంలోని షేక్ పేట  డివిజన్లో ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్దవు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. సీతానగర్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభించి ద్వారకానగర్, మారుతి నగర్, వినోబానగర్, వినాయక సగర్, శివాజీ నగర్, బాలాజీ నగర్ లో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపు, గంగపుత్ర సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యామని, వారంతా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పారన్నారు. మైనార్టీలు కూడా సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనన్న మంత్రి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బీజేపీ సపోర్టు చేస్తుందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఢిల్లీలో దోస్తానా ఉందన్నారు. అందుకే గత పార్లమెంట్ ఎన్ని కల్లో బీఆర్ఎస్, బీజేపీకి సపోర్ట్ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.