హైదరాబాద్: రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పన్నుల రూపంలో వెళితే.. మనకు కేవలం పదిపైసలే ఇస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఫైర్ అయ్యారు. గాంధీ భవన్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎకనామిక్స్ రిఫామ్స్తోనే ప్రజలకు లబ్ధి జరిగిందని తెలిపారు.
మాజీ ప్రధాన మంత్రులు పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పబ్లిక్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి పరిశ్రమలు స్థాపించిందే కాంగ్రెస్ అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్నినీరు గార్చేందుకే కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు.
►ALSO READ | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్.. ఈ సారి ప్రత్యేకతలు ఇవే !
నరేగాలో కేంద్రం ఇచ్చే నిధుల వాటాను తగ్గించడం ద్వారా ఆపథకాన్ని నీరుగార్చుతుందన్నారు.. దీంతో పేదలకు తీవ్ర నష్టం కలుగుతున్నారు. ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన నెహ్రూ కుటుంబపై బీజేపీ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నా రు. దేశంలో మత సామరస్యం కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నా రు. జనవరి 5 నుంచి కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.
