
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రైతాంగ పోరాటంలో తొలి అమరులు దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులశాఖమంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం( జూలై4) న దొడ్డికొమురయ్య వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ శ్రద్దాంజలి ఘటించారు.
1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన తొలి రైతాంగ పోరాట అమరులు దొడ్డి కొమురయ్య అని మంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసిన చారిత్రక పోరాటాల్లో రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
Also Read :లింగంపల్లి, చందానగర్ లో నాలా ఆక్రమణలు కూల్చివేత
1946-51 మధ్య కాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరవీరుడిగా నిలిచారు. భూస్వాముల దోపిడీ, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్యది కీలక పాత్ర.
కొమురయ్య నల్లగొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, కడివెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య భూస్వామి ఆగడాలకు వ్యతిరేకంగా రైతులను సమీకరించారు. 1946 జూలై 4న ఈ పోరాటంలో కొమురయ్యను హత్య చేశారు. కొమురయ్య త్యాగం తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీక. ఆయనను గుర్తుచేసుకుంటూ వర్థంతి పేరుతో అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు కొనసాగుతున్నాయి.