బోరబండ నుంచి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

బోరబండ నుంచి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా..జూబ్లీహిల్స్ బైపోల్ లో  డోర్ టూ డోర్ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు . బోరబండ నుంచి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని కోరారు. బోరబండ లో 55 బూత్ లు ఉన్నాయని చెప్పారు.  ఎక్కువ మెజారిటీ ఇస్తే  వచ్చే ఎన్నికల్లో ఎక్కువ నిధులు వస్తాయన్నారు. 

బై ఎలక్షన్ తర్వాత జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసే గ్యారంటీ తమదని అన్నారు వివేక్.  కాంగ్రెస్ మాత్రమే పనులు చేయగలుగుతుందని.. మీరంతా కాంగ్రెస్ కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బోరబండలో  స్మశాన వాటిక సమస్య గురుంచి  సీఎం రేవంత్ తో మాట్లాడుతానని చెప్పారు. 

10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో   కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇవ్వలేదన్నారు వివేక్. నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదన్నారు. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఫైర్ అయ్యారు.  జూబ్లీహిల్స్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఎం చేయలేదన్నారు.  కేటీఆర్ ఓట్ల కోసం ఏదేదో మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ  అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు వివేక్. జూబ్లీహిల్స్ లో   ఎక్కడా హైడ్రా రాలేదని ఒక్క ఇల్లు కూడా కూల్చలేదన్నారు. బోరబండకు జేసీబీలు వస్తున్నాయని  బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు వివేక్.