కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ రహమత్ నగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ కాలనీ లో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మలతో కలిసి శంకుస్థాపన చేశారు. 2.3 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. ఇంచార్జ్ ఇవ్వడంతో ఈ ప్రాంత ప్రజలకు సేవా చేసే అవకాశం వచ్చిందన్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ, వాటర్ సప్లై అవుతున్నాయ లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామనిచెప్పారు.. ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ మంచిగా పని చేస్తున్నారని తెలిపారు.
జూబ్లీహిల్స్ లో 180 రకాల పనుల మొదలు పెట్టాలి. సమస్యలన్నీ పరిష్కారం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుంది. చాలా మంది హై టెన్షన్ వైర్స్ ఉన్నాయని అంటే సీఎండీ నవీన్ మిట్టల్ ను అడిగితే వెంటనే అధికారిని ఏర్పాటు చేసి.. క్షేత్ర స్థాయిలో తిరిగి సర్వే చేయిస్తున్నారు. రహమత్ నగర్ లో జనాభా పెరుగుతోంది.. సదుపాయాలు కల్పించాలని స్థానికులు అడుగుతున్నారు. ఇక్కడ మంచి నీటి సమస్య రావొద్దని నిన్న ఎల్లంపల్లి నుంచి నీళ్లు తెచ్చేందుకు సీఎం శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో పని చేస్తున్నారు. బూత్ లెవెల్ కార్యకర్తలు మంచిగా పని చేయాలి అని మంత్రి వివేక్ అన్నారు.
►ALSO READ | కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వండి.. ఫార్ములా ఈ కారు కేసులో ప్రభుత్వానికి ACB రిపోర్ట్
