
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పీసీసీ ఏర్పాటు చేసిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రేపు(జులై 9) మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఉదయం 11 గంటల నుంచి మంత్రి వివేక్ వెంకట స్వామి పాల్గొంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నా వచ్చి ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసుకోవచ్చు ప్రజలు. సాధ్యమైనంత వరకు వెంటనే సమస్య పరిష్కారాన్ని మార్గాలు చూపుతారు.
గతంలో అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం 2025 జూన్ 4 నుంచి రీస్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖాముఖిలో పాల్గొని ప్రజాసమస్యలను స్వీకరించారు.
►ALSO READ | జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించండి: సీఎం రేవంత్