అందెశ్రీ కుటుంబ సభ్యులకు మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శ

అందెశ్రీ  కుటుంబ సభ్యులకు మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శ
  •     ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు: మంత్రి వివేక్‌‌‌‌
  •     అందెశ్రీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శ

లాలాపేట, వెలుగు: అందె శ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పాటల రూపంలో ప్రతీ గొంతులో ఆయన ఉంటారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌‌‌‌ లాలాపేటలోని అందెశ్రీ ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులను మంత్రి వివేక్‌‌‌‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అందె శ్రీ కీలక పాత్ర పోషించారని,  పాటలతో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చారని అన్నారు. ప్రజాకవిగా, సాహిత్యకారుడిగా ప్రభుత్వం గుర్తించి ఆయనను సన్మానించడం గర్వకారణమని తెలిపారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.