- రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
- చెన్నూరు, క్యాతనపల్లిలో విజయం సాధించాలి
- చెన్నూరు వార్డుల్లో మార్నింగ్‌వాక్, అభివృద్ధి పనుల పరిశీలన
- ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన మంత్రి
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఆయన మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత బైక్‌పై తిరుగుతూ వార్డుల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు.14వార్డు ఆదర్శనగర్‌లో స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగితెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు 40మందికి డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డితో కలిసి బీ -ఫాంలు అందజేశారు. ఆ తర్వాత మార్వాడీ భవన్ లో ఆ సామాజికవర్గం వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాఋట్లాడారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలన్నారు. మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు పార్టీ లీడర్లు, కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలని సూచించారు. మార్వాడీల అభ్యున్నతికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మార్వాడీ సమాజం ప్రేమాభిమానాలు తనకు ఎప్పుడు ఉండాలని అన్నారు. బిజినెస్ లోనూ, ఇతర విషయాల్లోనూ వృథా ఖర్చులు చేయరాదన్న విషయం తాను మార్వాడీల నుంచి నేర్చుకున్నానన్నారు. యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ లో దాదాపు 60 శాతం మంది మార్వాడీలే ఉన్నారన్నారు. మున్సిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ఈ సందర్భంగా ఆయన మార్వాడీలను కోరారు.
రూ.100 కోట్లతో అమృత్ స్కీమ్
చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.100 కోట్లతో అమృత్2.0 స్కీం చేపట్టినట్టు మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మరో ఆరునెల్లలో ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు సరఫరా చేస్తామన్నారు. మరో 15ఏళ్ల వరకు చెన్నూరులో తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు రూ.45 కోట్లతో గోదావరి తాగునీటి స్కీం ప్రతిపాదనలు రెడీ చేసినట్లు చెప్పారు. చెన్నూరు మున్సిపాలిటీ బ్యూటీఫికేషన్ కోసం రూ.10కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరులో పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించినట్లు చెప్పారు. పట్టణంలో రూ.40కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
రూ.50 కోట్లతో ఏటీసీ సెంటర్ ఏర్పాటు
యువతకు కొత్త కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చెన్నూరులో రూ.50 కోట్లతో ఏటీసీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణం పనులు ఈ నెల ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. మూడో యూనిట్‌ద్వారా స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయన్నారు. రూ.1.60 కోట్ల నిధులతో చెన్నూరు బైపాస్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని, రోడ్డు వెడల్పుతో నష్టపోయే వారికి కొత్త షాపులు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో రూ.1.2 కోట్లతో శ్మశానవాటిక పనులు ప్రారంభించామన్నారు. 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్‌గా మార్చుతున్నామని, మే నెలలో ప్రారంభిస్తామన్నారు. సోమనపల్లిలో రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరగుతోందన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల్లో చెన్నూరు నియోజకవర్గానికి అధిక నిధులు ఇవ్వాలని కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డిని కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
