ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లకు మంత్రి వివేక్ సన్మానం

 ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లకు మంత్రి వివేక్ సన్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను  చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు  మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు, కోటపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కోటపల్లి మండలంలో ఏకగ్రీవంగా ఎంపికైన అభ్యర్థులకు కండువా కప్పి సత్కరించారు  మంత్రి వివేక్ వెంకటస్వామి. అభ్యర్థులకు కార్యకర్తలు అందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం  కృషి చేయాలని కోరారు.  కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల్లో కాంగ్రెస్  చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి గెలుపు సాధించాలని సూచించారు మంత్రి వివేక్.

బీఆర్ఎస్ పని ఖతం

రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం అని వివేక్ వెంకటస్వామి అన్నారు. గ్రామాల్లో గులాబీ పార్టీ క్యాడర్ ను కోల్పోయిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన ఇవాళ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరు చెప్పి ఆ పార్టీ పదేండ్లు ప్రజలను మభ్య పెట్టిందని ఆరోపించారు. గత పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘటన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.