ఉద్యోగుల హెల్త్ పై ఇండస్ట్రీస్ శ్రద్ద తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

ఉద్యోగుల హెల్త్ పై ఇండస్ట్రీస్ శ్రద్ద తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆక్యు పేషనల్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్ గా బిజినెస్, ఇండస్ట్రీస్ సక్సెస్ బాటలో ఉంటాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోని బేగంపేటలో జరిగిన నేషనల్ ఆక్యు పేషనల్ హెల్త్ డే సెలెబ్రేషన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. 

ఈ సందర్భంగా మాట్లాడిన  వివేక్ వెంకటస్వామి. ఐఏఓహెచ్  నిర్వహించిన ఈ ఆక్యు పేషనల్ హెల్త్ డే కార్యక్రమంలో  పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో  ప్రీవెంటివ్ ఆక్యుపేషనల్ హెల్త్  చాలా ముఖ్యం.  పలు  రకాల బిజినెస్, పనులు చేసే వాళ్లు  చాలా హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీస్ కూడా ఉద్యోగుల హెల్త్ పై శ్రద్ద తీసుకోవాలి.  ఇటీవలే   పాశం మైలారం ఘటన చూశాం.  కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది కార్మికులు మరణించారు.  ఇండస్ట్రీస్ కూడా ఆక్యు పేషనల్ హెల్త్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆక్యు పేషనల్ హెల్త్ ఫిజిషియన్స్ సలహాలు ఇండస్ట్రిస్ వాళ్లు తీసుకుంటే కొని సమస్యలకు చెక్ పెట్టొచ్చు. 

►ALSO READ | తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది..ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు

 ఇండస్ట్రీస్ లో పని చేసే కార్మికులకు హెల్త్ ముఖ్యం..దానిని అశ్రద్ధ చేయొద్దు.  సేఫ్టీ, ప్రివెన్షన్ రెండు ఇండస్ట్రీస్ కు ముఖ్యమైనవి. ఆక్యు పేషనల్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్ గా బిజినెస్, ఇండస్ట్రీస్ సక్సెస్ బాటలో ఉంటాయి.  డాక్టర్స్ కూడా స్కిల్స్ ను రెగులర్ గా అప్ డేట్ అవ్వడంతో డెవలప్ చేసుకోవాలి.  నేను ఒక డాక్టర్ గా, ఇండస్ట్రియలిస్ట్ గా రెగులర్ గా అప్ డేట్ అవుతాను. IAOH ఆధ్వర్యంలో ఈ తరహా సెమినర్స్ మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నా అని అన్నారు