హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయ్యింది.. అప్పుడే కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అంటున్నారు.. మరీ పదేండ్లలో మీరేం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారని నిలదీశారు. పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు కేవలం వాళ్ళు సొంత ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు.
గురువారం (అక్టోబర్ 30) షేక్ పేట్ డివిజన్లో రాష్ట్ర మత్య్సకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మత్య్సకార గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి వాకిట శ్రీహరి అడిగిన వెంటనే మత్య్సకారుల కోసం ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్ కట్టిస్తానన్నాడని చెప్పారు.
ALSO READ : బస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్
గంగపుత్రులు, కుల సంఘాల నాయకులు తమను కలిసి సమస్యలు చెప్పారని.. వెంటనే రూ.53 లక్షలు సాంక్షన్ చేశామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కమ్యూనిటీ హాల్ కూడా ఎన్నికల ముగియగానే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో దొరిగిన కొరమిను చేప ఎక్కడ దొరకదని అన్నారు. గంగపుత్రుల సమస్యల కోసం శ్రీహరి కాబినెట్లో పోరాటం చేస్తారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన కూడా ఎత్తివేయించారన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
