బస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్

బస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్

కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురై.. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే కదా.. ఈ ప్రమాదంలో బస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం. ఈ మేరకు 2025, అక్టోబర్ 30వ తేదీన 40 లక్షల రూపాయల చెక్కును కర్నూలు కలెక్టరేట్ లో అందజేశారు ట్రావెల్స్ ప్రతినిధులు.

బస్సు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి.. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయల సాయం కూడా చేశారు వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ప్రతినిధులు. కలెక్టరేట్ లో ఈ చెక్కును ఏపీ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అందించారు. బాధితులకు ఈ సాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఉన్నారు. 

చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.