అధైర్య పడకండి.. అండగా ఉంటం: రైతులకు మంత్రి వివేక్ భరోసా

అధైర్య పడకండి.. అండగా ఉంటం: రైతులకు మంత్రి వివేక్ భరోసా

మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రితో ఇప్పటికే పంట నష్టంపైన మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే పంట నష్టంపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

రైతులెవరూ ఆందోళన చెందొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కాగా, చెన్నూరు నియోజకవర్గంలో మంగళవారం (5) రాత్రి అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. అకాల వర్షంతో కొనుగోళ్లు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.