ఇద్దరు సీఎంల మీటింగ్ కు హాజరైంది వీళ్లే.. ఫొటోలు

ఇద్దరు సీఎంల మీటింగ్ కు హాజరైంది వీళ్లే.. ఫొటోలు

హైదరాబాద్ బేగంపేటలోని చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు.

తెలంగాణ తరుఫున హాజరైనవారు

రాష్ట్ర మంత్రులు ఈటల రాజెందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపీ కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్ కో -ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఇతరులు హాజరయ్యారు.

ఏపీ తరఫున హాజరైనవారు

ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్ర నాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని), సజ్జల రామకృష్ణారెడ్డి తోపాటు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్ రావు, నీటి పారుదల శాఖ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉదయం 11: 15 గంటలకు జగన్ తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి జగన్ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులను జగన్ కు సీఎం కేసీఆర్  పరిచయం చేశారు. జగన్ ను కేసీఆర్ తన ఛాంబర్ కు తీసుకెళ్లి కాసేపు మాట్లాడారు.

11.30 గంటలకు ఇధ్దరు ముఖ్యమంత్రులు మీటింగ్ హాల్ కు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, జగన్ కు, ఏపీ బృందానికి స్వాగతం పలికారు.