
కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం కేసీఆర్. సీనియర్ మంత్రి ఈటలకు వైద్య, ఆరోగ్యశాఖ అలాట్ చేశారు. ఇంద్రకరణ్ రెడ్డికి గతంలో ఉన్న దేవాదాయ, న్యాయశాఖతో పాటు ఈసారి అదనంగా అటవీశాఖను అప్పగించారు. జగదీశ్ రెడ్డికి గత ప్రభుత్వం మొదట్లో నిర్వర్తించిన విద్యాశాఖను కట్టబెట్టారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కీలకమైన వ్యవసాయశాఖను ఇచ్చారు. వేముల ప్రశాంత్ రెడ్డికి రోడ్లు, భవనాలతో పాటు రవాణా శాఖ అలాట్ చేశారు. మరో సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈసారి కూడా పశుసంవర్థకశాఖను ఇచ్చారు. ఇక కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమం ఇచ్చిన సీఎం కేసీఆర్.. మల్లారెడ్డికి కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి శాఖను కట్టబెట్టారు. శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్, పర్యాటకం, క్రీడల శాఖను కేటాయించారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు పంచాయతీ రాజ్ శాఖను ఇచ్చారు .
ఇవాళ ఉదయం రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. 10మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.