
హైదరాబాద్, వెలుగు: రైస్ మిల్లుల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలనే దానిపై మంత్రుల కమిటీ సోమవారం తుది నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో అధికారులతో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది. మిల్లుల్లో స్టోరేజ్ స్పేస్ సిద్ధం చేసే అంశంపై చర్చ జరిగింది. మీటింగ్కు మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి , గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ హాజరయ్యారు.
ధాన్యం నిల్వలను వెంటనే మిల్లింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను మంత్రుల కమిటీ ఆదేశించింది. ప్రస్తుతమున్న 92 లక్షల టన్నుల ధాన్యాన్ని వేగంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాలని స్పష్టం చేసింది. బియ్యాన్ని తిరస్కరించకుండా ఎఫ్‌సీఐతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ అనిల్ కుమార్ కు సూచించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ లోపు ధాన్యాన్ని డిస్పోస్ చేయాలని కమిటీ పేర్కొంది.