దేశంలోనే ప్రజాకర్షక పథకాలు.. ఆ ఘనత సీఎం కేసీఆర్ దే

దేశంలోనే ప్రజాకర్షక పథకాలు.. ఆ ఘనత సీఎం కేసీఆర్ దే

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో  రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, తీగల శ్రీనివాస్ గౌడ్  గౌడ కులానికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వందల ఏళ్ల క్రితమే చిన్న రాజ్యాన్ని స్థాపించి దొరల నుంచి దోచిన డబ్బును  బడుగువర్గాలకు  పంచిన ఘనత సర్వాయి పాపన్నదని అన్నారు. పాపన్న ఘనతకు నిదర్శనం ఆయన విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో పెట్టడమేనన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. దేశంలోనే ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి.. వాటిని అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గత పాలకులు కులవృత్తులను నాశనం చేయగా.. సీఎం కేసీఆర్ గౌడ కులస్థులను అదుకునేందుకు నీరా పథకాన్ని ప్రవేశపెట్టాడని అన్నారు. గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల ప్రమాద భీమాను అందిస్తున్నది తెలంగాణ సర్కారు మాత్రమేనన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి హరిష్ రావుతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్ కుమార్, ఎమ్మెల్సీ నరోత్తం రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు.