మహిళా అధికారులను అవమానిస్తున్నరు ..మహిళా కమిషన్ కు BRS నేతల ఫిర్యాదు

మహిళా అధికారులను అవమానిస్తున్నరు ..మహిళా కమిషన్ కు  BRS నేతల ఫిర్యాదు

పద్మారావునగర్, వెలుగు: మహిళా అధికారులను మంత్రులు అగౌరవపరిచేలా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్​రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు స్వతంత్రంగా పనిచేశారని, ఇప్పుడు వారిని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు.

 మహిళా అధికారులను మంత్రులు తమ నివాసాలకు పిలిపించి రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇది మహిళలను అగౌరవపరచడమేనని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బుద్ధభవన్​లోని మహిళా కమిషన్ కార్యాలయంలో సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.