కాంగ్రెస్ తోనే రాష్ట్రాభివృద్ధి.. బీసీ రిజర్వేషన్లు ఘనత మాదే : కోమటిరెడ్డి

కాంగ్రెస్ తోనే రాష్ట్రాభివృద్ధి.. బీసీ రిజర్వేషన్లు  ఘనత మాదే  : కోమటిరెడ్డి

పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు.  నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా ఉండాలని కోరారు. 

 నల్లగొండ జిల్లా దండంపల్లి లో రూ. 8 కోట్ల  వ్యయంతో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.   ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  రవాణా శాఖ నుంచి  ఏ అవసరమున్న నల్గొండ జిల్లాకు  అధిక నిధులు ఇవ్వాలన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ALSO READ | స్థానిక సంస్థల చరిత్ర.. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి..

ఉచిత బస్సు వల్ల ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్తుుండటంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు.  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని చెప్పారు. రూ.6 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో పొన్నం ప్రభాకర్ కేబినెట్ లో కొట్లాడరని చెప్పారు. బీసీ రిజర్వేషన్  కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు.