
తెలంగాణ వ్యాప్తంగా కాకా వెంకటస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సాగర్ పార్కులో కాకా విగ్రహం దగ్గర కాకా వెంకటస్వామి 96 జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు,వాకిటి శ్రీహరి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి,పలువురు రాజకీయనాయకులు కాకాచిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం కాకా విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను కొనియాడారు.
అంతకుముందు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సరోజా వివేక్, సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ కాకా చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాకా అభిమానులు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.