అన్నం మంచిగలేదు. టాయిలెట్లు గలీజ్.. విద్యార్థుల సమాధానంతో మంత్రులు సబితా, తలసాని షాక్

అన్నం మంచిగలేదు. టాయిలెట్లు గలీజ్.. విద్యార్థుల సమాధానంతో మంత్రులు సబితా, తలసాని షాక్

సన్న బియ్యంతో అన్నం పెడుతున్నం...కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ..తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పి్స్తున్నాం..అంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తుంటే..క్షేత్ర స్థాయిలో మాత్రం మరోలా ఉంది. కనీసం స్కూళ్లలో కనీసం అవసరం అయిన టాయిలెట్లు సరిగా లేవు. ఇక విద్యార్థులకు కనీసం నీళ్లు..నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని మరోసారి స్పష్టమైంది. 

రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్లోని సనత్ నగర్ అశోక్ నగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.  ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలోని సమస్యలపై విద్యార్థులను మంత్రులు అడిగారు. ఈ సందర్భంగా స్కూళ్లో భోజనం సరిగా పెట్టడం లేదని..భోజనం అస్సలు బాగాలేదని విద్యార్థులకు మంత్రులకు వివరించారు. ఇక టాయిలెట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయని..మంచి నీరు కూడా లేదని చెప్పారు. తమ విద్యార్థుల్లో దాదాపు 60 శాతం మంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని చెప్పడంతో మంత్రులు షాక్ తిన్నారు.