
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లు తెలిపారు. స్వర్ణకారుల సంక్షేమానికి త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
శనివారం రాష్ర్ట స్వర్ణకార సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాఘవచారి, వెంకటస్వామిలు మంత్రులను కలిసి స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందచేశారు. లోకల్ బాడీ ఎన్నికల లోపే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతినిధులు మంత్రులను కోరారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి అండగా ఉంటామని, పార్టీ గెలుపునకు కృషి చేస్తామని మంత్రులకు ప్రతినిధులు స్పష్టం చేశారు.